రేస్ లో వెనకబడ్డ సల్మాన్

రేస్ లో వెనకబడ్డ సల్మాన్

రంజాన్ సందర్భంగా సల్మాన్ ఖాన్ నటించిన రేస్ 3 సినిమా విడుదలైంది.  ఈ సినిమాపై అభిమానులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు.  ఇలాంటి సినిమాల్లో నటించడం సల్మాన్ కు కొత్త అయినప్పటికీ దర్శకుడిపై నమ్మకంతో.. రేస్ 3 కి తానే నిర్మాతగా వ్యవహరించాడు.  సల్మాన్ నటిస్తూ నిర్మాతగా వ్యవహరించడంతో.. సినిమాకు ఫుల్ బిజినెస్ జరిగింది.  శాటిలైట్ రైట్స్ పరంగానే ఈ సినిమా ఏకంగా రూ. 90 కోట్ల రూపాయల ఆదాయాన్ని సాధించింది.  ఇండియాలో అత్యధిక శాటిలైట్ ధరకు అమ్ముడు పోయిన సినిమా రేస్ 3 కావడం విశేషం.  

భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో నిర్మిస్తమైన ఈ సినిమా ప్రీమియర్ షోల నుంచే నెగెటివ్ టాక్ మొదలైంది.  రేస్ 3 సినిమాకు సల్మాన్ ఎలా ఒప్పుకున్నాడో అర్ధం కావడం లేదని ఫ్యాన్స్ అంటున్నారు. బాలీవుడ్ క్రిటిక్స్ సైతం ఈ సినిమాకు దారుణమైన రేటింగ్ ఇవ్వడంతో.. సల్మాన్ ఖాన్ రేసులో వెనకబడిపోయారని చెప్పొచ్చు.  సల్మాన్ ఖాన్ అభిమానులు సైతం ఈ సినిమా గురించి ట్విట్టర్ లో కామెంట్స్ చేస్తున్నారంటే అర్ధం చేసుకోవచ్చు సినిమా ఎలాంటి ఎలా ఉన్నదో.  పాజిటివ్ టాక్ వస్తే నెత్తిన పెట్టుకునే అభిమానులు ఇప్పుడు ట్విట్టర్ లో ట్రోల్ చేస్తున్నారు.  ఇంకెప్పుడు ఇలాంటి సినిమాల్లో నటించవద్దని సల్మాన్ కు అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.