సమంతకు ఇలాంటి సినిమాలంటేనే ఇష్టమా..?

సమంతకు ఇలాంటి సినిమాలంటేనే ఇష్టమా..?

సమంత వివాహం తరువాత వరస హిట్స్ తో వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నది.  మరో రెండేళ్ల వరకు సమంత బిజీగా ఉండబోతున్నది.  ఇప్పుడు ఆమె చేతిలో దాదాపు అరడజనుకు పైగా సినిమాలుఉన్నాయి .  ఆమెకు విజయాలు కొత్తకాదు.  కానీ, సంతృప్తి కలిగించే సినిమాలు వచ్చినప్పుడే మనసుకు ఆనందం కలుగుతుంది.  ఇటీవల కాలంలో వరసగా అలాంటి సినిమాలు వస్తున్నాయి.  రంగస్థలం, మహానటి సినిమాలు అలాంటివే.  రెండింటిలోనూ సమంతకు ప్రాధాన్యత ఉన్న సినిమా.  

ప్రేక్షకుల నుంచి ఈ రెండు సినిమాలకు విశేషమైన ఆదరణ లభిస్తోంది.  ఇలాంటి సినిమాలే సంతృప్తిని ఇస్తాయి, నాలోని నటికి ఊపిరి పోస్తుంది అంటోంది సమంత.  పెళ్లి తరువాత నటించడం అవసరమా అనే ఆలోచనలు ఎన్నోసార్లు వచ్చాయట.  కొత్తదనం లేని పాత్రలు రావడం వలెనే అలాంటి ఆలోచనలు వచ్చాయని అంటోంది.  అదృష్టవశాత్తు మనసుకు సంతృప్తినిచ్చే సినిమాల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి.  కమర్షియల్ సినిమాలంటే ఎక్కువ ఇష్టం అని అంటూనే.. అలాంటి కథల్లోను హీరోయిన్ కు మంచి బలమున్న పాత్రలు వస్తుంటాయని చాలా సినిమాలు నిరూపించాయని చెప్తోంది సమంత.