సమంత రాకున్నా ఆమె గురించే టాక్...

సమంత రాకున్నా ఆమె గురించే టాక్...

నాగచైతన్య ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హిట్ మజిలీ రూపంలో పలకరించింది.  ఈ హిట్ లో సగం క్రెడిట్ సమంత పాకెట్ లోకే వెళ్తుంది అనడంలో సందేహం లేదు.  సమంత క్యారెక్టరైజేషన్ డిజైన్ అలా ఉంది.  నాగచైతన్య యాక్టింగ్ ను కూడా మెచ్చుకోకుండా ఉండలేము.  

సినిమా హిట్టైన తరువాత మజిలీ టీమ్ సక్సెస్ మీట్ ను నిర్వహించింది.  అందులో సమంత స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచినా సంగతి తెలిసిందే.  కాగా, ఇప్పుడు ప్రేక్షకులకు థాంక్స్ చెప్పేందుకు స్పెషల్ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.  ఈ ప్రెస్ మీట్ కు సమంత హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.  లాస్ట్ టైం జరిగిన ప్రెస్ మీట్ లో సమంత హాజరైంది కాబట్టి ఈసారి సెకండ్ హీరోయిన్ దివ్యాన్ష ను పిలిచారని వార్తలు వచ్చాయి.  అటు స్పీచ్ లో కూడా సమంత ప్రస్తావన రాకపోవడం విశేషం.  మొత్తానికి సమంత హాజరు కాకున్నా... తన గురించి మాట్లాడుకునే విధంగా చేసి వార్తల్లో నిలిచింది.