అర్జున్ రెడ్డి సినిమా కోసం షాహిద్ కపూర్ ఏం చేశాడో చూశారా..?

అర్జున్ రెడ్డి సినిమా కోసం షాహిద్ కపూర్ ఏం చేశాడో చూశారా..?

టాలీవుడ్ లో ఎక్కువమంది యూత్ ను ఎట్రాక్ట్ చేసిన సినిమాల్లో అర్జున్ రెడ్డి ఒకటి.  ఈ సినిమాతో విజయ్ దేవరకొండ యూత్ ఐకాన్ గా మారిపోయాడు.  ఈ సినిమా స్పూర్తితో ఎన్నో సినిమాలు వచ్చాయి.  ఇది వేరే విషయం అనుకోండి.  అర్జున్ రెడ్డి సినిమా హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ అవుతున్నది.   షాహిద్  కపూర్ హీరో.  

ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడట.  రోజు కనీసం 20 సిగరెట్లు తాగాల్సి వచ్చేదని, పిల్లల దగ్గర ఆ వాసన రాకూడదని కనీసం గంటసేపు స్నానం చేసేవాడినని చెప్పాడు.  అచ్చంగా స్టూడెంట్ గా ఉండేందుకు ఢిల్లీలోని కొంతమంది విద్యార్థుల దగ్గర వారి బట్టలు అరువు తెచ్చుకున్నాడట.  వాళ్లతో కలిసిమెలిసి తిరిగి వాళ్ళ హవభవాలను క్షుణ్ణంగా పరిశీలించినట్టు షాహిద్ కపూర్ చెప్పాడు.  సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్ 21 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.