సూర్య సినిమా ఎక్కడా..?

సూర్య సినిమా ఎక్కడా..?

సూర్య ఎన్జీకే సినిమా మే 31 వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమా కోసం తమిళనాడులో అతిపెద్ద కటౌట్ ను నిర్మిస్తున్నారు.  సినిమాపై పాజిటివ్ వైబ్ క్రియేట్ కావడం విశేషం.  రాజకీయాలకు సంబంధించిన సినిమా కావడంతో ఆసక్తి నెలకొంది.  సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ లు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.  

సూర్య సినిమాకు టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది.  గజినీ సినిమా తరువాత సూర్య సినిమాలు తెలుగులో భారీ విజయాలు సాధిస్తున్నాయి.  గత కొంతకాలంగా అయన సినిమాలు మూస పద్దతిలో ఉండటంతో మార్కెట్ తగ్గిపోయింది.  ఎన్జీకే కు పాజిటివ్ వైబ్ రావడంతో టాలీవుడ్ లో కూడా భారీగా రిలీజ్ చేస్తారని అనుకుంటున్నారు.  అయితే ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రమోషన్స్ టాలీవుడ్ చేయకపోవడం విశేషం.  ఈ సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారని చెప్పి రాజశేఖర్ కల్కి సినిమాను వాయిదా వేసుకున్నారు.