ఆరోజు ప్రధాని మోడీ పార్లమెంట్ కు హాజరు కాకాపోవడానికి ఇదే కారణం...!!

ఆరోజు ప్రధాని మోడీ పార్లమెంట్ కు హాజరు కాకాపోవడానికి ఇదే కారణం...!!

కేంద్రంలో ప్రధాని మోడీ అధ్యక్షతన రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  మోడీ మొదటిసారి అధికారంలోకి వచ్చిన సమయంలో నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపలేదు.  2019 ఎన్నికలకు ముందు ఆర్టికల్ 370 ని రద్దు చేయాలనీ అనుకున్నారు.  ఒకవేళ ఆర్టికల్ 370 రద్దును ఎన్నికలకు ముందు చేస్తే, ఎన్నికల్లో ఓట్లు సంపాదించడం కోసమే బీజేపీ ఈ పని చేస్తుందనే టాక్ వస్తుంది.  ప్రతిపక్షాలు ఈ దిశగానే ప్రచారం చేసుకుంటాయి.  ఆ అవకాశం ఇవ్వకూడదు అని చెప్పి 2019 ఎన్నికలు పూర్తయ్యే వరకు వేచిచూశారు. 

2019 ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన సమయంలో ఓ కీలకమార్పును తీసుకొచ్చింది.  హోంశాఖ మంత్రిగా అమిత్ షాను నియమించారు.  రాజ్ నాథ్ సింగ్ స్థానంలో షాను నియమించడం రాజ్ నాథ్ సింగ్ కు ఇష్టం లేదు.  కానీ, కొన్ని కీలక బిల్లుల విషయంలో దూకుడుగా వ్యవహరించాలి.  ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా వ్యవహరించాలి అంటే దానికి తగిన వ్యక్తిని హోమ్ శాఖామంత్రిగా నియమించాలి. రాజ్ నాథ్ సింగ్ సమర్ధవంతమైన నాయకుడే... కానీ, అమిత్ షాలా దూకుడు స్వభావం కలిగిన వ్యక్తి కాదు.  అందుకే రాజ్ నాథ్ సింగ్ స్థానంలో షాను తీసుకొచ్చారు.  

మొదట త్రిపుల్ తలాఖ్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్నాక, ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉన్నది.  ఈ బిల్లును ప్రవేశపెట్టే సమయంలో ప్రధాని మోడీ సభలో లేరు.  ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. షా బిల్లును ప్రవేశపెట్టిన విధానం, వ్యూహాత్మకంగా దానిని ఆమోదింపజేసుకున్న విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.  మొదటిసారి ఎంపీగా, కేంద్ర హోంశాఖ మంత్రిగా ఎంపికైన షా, సభలో వ్యవహరించిన తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది.  అయితే, సన్నిహితుల సమాచారం ప్రకారం, ఆర్టికల్ 370 బిల్లును సభలో ప్రవేశపెట్టిన రోజున మోడీ ఢిల్లీలోనే ఉన్నారని, అమిత్ షాకు ఈ క్రెడిట్ ఇచ్చేందుకే మోడీ ఆరోజున సభకు హాజరుకాలేదని అంటారు.  మోడీ తరువాత భవిష్యత్ అమిత్ షానే అని ఆ సంఘటనతో అర్ధం అయ్యింది.  మోడీ తరువాత షా ప్రధాని అయినా ఆశ్చర్యపోనవసరం లేదు.