విలన్ గా భయపెడుతున్న హీరోయిన్

విలన్ గా భయపెడుతున్న హీరోయిన్

హీరోయిన్లు గ్లామర్ పాత్రలకే ఎక్కువగా పరిమితం అవుతుంటారు.  అవకాశం వచ్చినప్పుడు తమను తాము నిరూపించుకుంటున్నా.. హీరోలతో సమానంగా పాత్రలు రావడం లేదు అన్నది సత్యమే.  నటనలో వైవిధ్యం కనబరిస్తే.. విలన్ పాత్రల్లో కూడా హీరోయిన్లు మెప్పించవచ్చు.  వాళ్ళల్లో ఆ సామర్ధ్యం ఉంది.  కానీ, మనవాళ్ళు దైర్యం చేయరు.  

కోలీవుడ్ లో ఇందుకు భిన్నంగా విలన్ హీరోయిన్ల చేత విలన్ రోల్ ప్లే చేయిస్తుంటారు.  గతంలో రజినీకాంత్ పడయప్ప సినిమాలో రమ్యకృష్ణ నీలాంబరిగా మెప్పించింది.  తరువాత, ధనుష్ సినిమా ధర్మయోగిలో త్రిషా కరడుగట్టిన రాజకీయ విలన్ గా భయపెట్టింది.  ఇప్పుడు అదే బాటలో ప్రముఖ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నడుస్తున్నది.  హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ బొద్దుగుమ్మ, అనతికాలంలో మంచి పేరు తెచ్చుకుంది.  హీరోయిన్ గా ఉంటె కొత్తదనం ఏముంటుంది అనుకుందేమో.. తనలోని వైవిధ్యాన్ని తెరపై ప్రదర్శించాలని అనుకోని విలన్ గా మారిపోయింది.  సత్య సినిమాలో విలన్ రోల్ ప్లే చేసి ఔరా అనిపించుకున్న వరలక్ష్మి, ఇప్పుడు తాను ప్రేమించిన విశాల్ కోసం అతని సినిమా పందెంకోడి 2 లో విలన్ రోల్ ప్లే చేస్తున్నది.  ఈ సినిమాతో పాటు ధనుష్ మారి 2 లో కూడా విలన్ రోల్ ప్లే చేస్తున్నది వరలక్ష్మి.  

విశాల్ పందెంకోడి 2 సినిమా కోసం తెలుగులో వరలక్ష్మి సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నది. తెలుగు డబ్బింగ్ చెప్పే సమయంలో గొంతు కొంచెం నొప్పిగా మారిందని.. పడిన కష్టానికి ఫలితం తప్పకుండా వస్తుందని అంటున్నది వరలక్ష్మి.