వర్మ తగ్గడం ఏంటి.. ఇదేం విచిత్రం!! 

వర్మ తగ్గడం ఏంటి.. ఇదేం విచిత్రం!! 

రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాను యమా స్పీడ్ గా కంప్లీట్ చేసిన వర్మ.. అదే ఊపులో రిలీజ్ చేయాలనీ అనుకున్నారు.  కానీ, వర్మకు అనేక వర్గాల నుంచి ఒత్తిళ్లు రావడం మొదలయ్యాయి.  ఈ ఒత్తిళ్లకు బాబు తలొగ్గినట్టు తెలుస్తోంది.  ఒత్తిళ్లకు తలొగ్గిన వర్మ సినిమా టైటిల్ మార్చబోతున్నట్టు ప్రకటించారు.  దీనికి తగ్గట్టుగా అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు అని మార్చారని తెలుస్తోంది.  

ఈ టైటిల్ మార్చడం వలన వర్మకు వచ్చిన నష్టం ఏమి లేదు.  చేయాల్సిన వివాదం, కిరికిరి మొత్తం ఇప్పటికే వర్మ చేశాడు.  సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీని తెచ్చుకున్నారు. అంతకంటే వర్మకు కావాల్సింది ఏముంటుంది. ఇక ఇదిలా ఉంటె, ఈరోజు హైకోర్టుకు రివ్యూ ఇవ్వనున్నారు.  దానిని బట్టే రేపు సినిమా రిలీజ్ ఆధారపడి ఉన్నది.