6 నెలల క్రితం ప్రేమ పెళ్లి.. ఇవాళ ఆత్మహత్య

6 నెలల క్రితం ప్రేమ పెళ్లి.. ఇవాళ ఆత్మహత్య

ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ప్రశాంత్‌నగర్‌లో నివాసం ఉంటున్న భార్యభర్తలు ఇవాళ ఆత్మహత్య చేసుకున్నారు. రమేష్‌నాయుడు(45), అనిత (35) అనే దంపతులు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. విశాఖపట్నానికి చెందిన రమేష్‌నాయుడు.. ఆరు నెలల క్రితం అనితను ప్రేమ వివాహం చేసుకున్నారు. రమేష్‌కి ఇది రెండో వివాహం అని తెలిసింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.