భర్త అక్రమ సంబంధం: చితకబాదిన భార్య 

భర్త అక్రమ సంబంధం: చితకబాదిన భార్య 

అక్రమ సంబంధాలు మనిషిని ఎంత దిగజారుస్తాయో చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. బయటపడనంత వరకు ఇవి బాగానే ఉంటాయి.  ఒక్కసారి బయటపడిన తరువాత దాని వలన వచ్చే ఇబ్బందులు అన్ని ఇన్ని కాదు.  ఓ వ్యక్తి భార్యకు తెలియకుండా మరొక యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.  నిలదీస్తే అలాంటిది ఏమి లేదని బుకాయించాడు.  భర్త ప్రవర్తనపై అనుమానం కలిగిన భార్య ఆయనకు తెలియకుండా ఫాలో చేసింది.  వేరే యువతితో సంబంధం పెట్టుకున్న విషయం తెలియడంతో బంధువులకు సమాచారం అందించింది.  గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్న ఈ సంబంధం కాస్త బంధువుల సహాయంతో వీధిన పడింది.  బంధువులు, భార్య కలిసి భర్తను, అయన ప్రియురాలిని చితకబాదారు.  అనంతరం వారిని పోలీసులకు అప్పగించారు.  ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మేదరబస్తీలో జరిగింది.