కూర వద్దన్నాడని భర్తను చితక్కొట్టిన భార్య... 

కూర వద్దన్నాడని భర్తను చితక్కొట్టిన భార్య... 

కాపురం అన్న తరువాత గొడవలు సహజమే.  కొంతమంది తరచుగా కీచులాడుతుంటారు.  అంతలోనే కలిసిపోతుంటారు.  ఇంట్లో జరిగే గొడవల్లో భర్తలదే పైచేయిగా ఉంటుంది.  కానీ, అహ్మదాబాద్ లో ఓ ఇంట్లో జరిగిన గొడవలో మాత్రం భార్య పైచేయి సాధించింది.  భర్తను చితక్కొట్టింది.  ఇంతకీ ఎందుకు భర్తను కుమ్మేసిందో తెలుసుకుందాం.  

అహ్మదాబాద్ లోని వాస్నా ప్రాంతంలో హర్షద్ గోయల్, తారా గోయల్ లు నివసిస్తున్నారు.  వీరిద్దరి మధ్య తరచుగా గొడవలు జారుతూనే ఉన్నాయి.  అయితే, ఓ రోజు భార్య చపాతీల్లోకి బంగాళదుంప కూర వండింది.  తనకు మధుమేహం ఉందని, ఈ కూర తింటే మధుమేహం పెరుగుతుందని, తెలిసి కూడా ఎందుకు వండావ్ అని భార్యపై గయ్ మని లేచాడట.  దీంతో భార్యకు ఎక్కడా లేని కోపం వచ్చింది. కష్టపడి వంట చేస్తే వద్దంటావా అని చెప్పి, బట్టలు ఉతికేందుకు ఉపయోగించే కర్రను తీసుకొచ్చి భర్తను చితక్కొట్టింది.  దీంతో భర్త షాకయ్యాడు.  పెద్దగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు వచ్చి అతడిని రక్షించారు.  వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అతని కుడిచేయి భుజం విరిగినట్టు తేలింది.  తన భార్యపై చర్యలు తీసుకోవాలంటూ ఆ భర్త పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు.