భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని చితకబాదిన భార్య..!

భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని చితకబాదిన భార్య..!

మరో మహిళలతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదిందో ఇల్లాలు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని శక్తి నగర్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.. కరీంనగర్ కి చెందిన పద్మకి హైదరాబాద్ చింతల్ కుంటకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది... అయితే, పద్మకి పిల్లలు లేరు.. ఇదు సాకుగా చూపి.. వేరొక మహిళతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు శ్రీనివాస్... ఈ విషయం తెలిసిన భార్య తట్టుకోలేకపోయింది.. తన భర్త మరో మహిళతో ఇలా చాటుమాటు వ్యవహారాన్ని కొనసాగించడాన్ని జీర్ణించుకోలేకపోయింది.. తన భర్త వేరొక మహిళలో కలిసిఉన్న ఇంటికి వెళ్లి.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని చితకబాదింది... పద్మకు ఆమె తండ్రి సహకరించారు.. ఇక పద్మ ఇచ్చిన ఫిర్యాదుతోరంగంలోకి దిగిన పోలీసులు.. శ్రీనివాస్‌ని, ఆ మహిళలను కూడా అదుపులోకి తీసుకున్నారు.