పడక గదిలో భర్తను గావు కేక పెట్టించిన భార్య... ఆ ఎలుకే కారణమా? 

పడక గదిలో భర్తను గావు కేక పెట్టించిన భార్య... ఆ ఎలుకే కారణమా? 

భార్య భర్తలు విడిపోయారు.  కానీ, ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు.  వేరు వేరు గదుల్లో ఉంటున్నారు.  ఓరోజు ఆ ఇంట్లోకి ఎలుక వచ్చింది.  ఎలుకను చూసి భయపడిన ఆ మహిళ విషయాన్ని తన భర్తకు చెప్పింది.  ఎలుకే కదా ఏం చేస్తుందిలే అని చెప్పాడు.  బెడ్ రూమ్ లో ఎలుక తురుగుతుండటంతో భయపడిన ఆ భార్య రాత్రి మొత్తం నిద్రపోకుండా అలానే కూర్చుకున్నది.  అయితే, పక్క గదిలో భర్త గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు.  ఎలుక ఉందని చెప్పినా వినకుండా గుర్రు పెట్టి నిద్రపోతున్న భర్తను చూసి ఆ భార్యకు ఎక్కడా లేని కోపం వచ్చింది.  

ఆ కోపంలో భర్త మర్మాంగాన్ని కోరికేసింది.  దీంతో ఆ భర్త గావుకేక పెట్టి పరుగుపరుగున ఆసుపత్రికి వెళ్ళాడు.  హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించుకున్న తరువాత ఆమెపై పోలీసు కేసు పెట్టాడు.  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  ఈ సంఘటన జాంబియాలోని కిట్వే లో జరిగింది.