నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న భర్త... దాంతో భార్య..

నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న భర్త... దాంతో భార్య..

నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. దాంతో న్యాయం చేయాలంటూ బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. ఆ మహిళా మాట్లాడుతూ... మ్యాట్రిమోని ద్వారా వెంకట బాలకృష్ణ పవన్ కుమార్ అనే వ్యక్తి తో పరిచయం అయింది. పెద్దల సమక్షంలో 2018 లో పెళ్లి చేసుకున్నాం. మా తల్లిదండ్రులు 30 లక్షలు కట్నంగా ఇచ్చారు. పవన్ దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్నాడు. నమ్మించి పెళ్లి చేసుకొని మోసం చేసాడు. పవన్ కు గతంలోనే ముగ్గురితో వివాహం అయ్యింది.. ఆ విషయం పెళ్లి అయ్యాక, మేం దుబాయ్ వెళ్ళాక చెప్పారు. మొదటి భార్యకు పిల్లలు కూడా ఉన్నారు. అక్కడ నా మీద పలుమార్లు హత్యాయత్నం చేసాడు. పవన్ తల్లిదండ్రులకు సైతం ఈ పెళ్లిళ్ల సంగతి తెలుసు. గత సంవత్సరం మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసాను. ఆ కేసు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అత్తా, మామాలు కేసు వదులుకోమని ఒత్తిడి చేస్తున్నారు. పవన్ అతని స్నేహితులు.. నా ఈ మెయిల్ , ఫోన్ హ్యాక్ చేసి నన్ను బెదిరిస్తున్నారు. నాకు జరిగిన అన్యాయం ఏ అమ్మాయికి జరగకూడదు. పవన్ పై చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలి అంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్, మహిళా పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు హిమబిందు.