ప్రియుడి మోజులో పడి భర్తను దారుణంగా చంపేసిన భార్య

ప్రియుడి మోజులో పడి భర్తను దారుణంగా చంపేసిన భార్య

కదిరి పట్టణంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. భార్య అనే పదానికే మచ్చ తెచ్చింది ఓ ఇల్లాలు, తన మెడలో మూడు ముళ్ళు వేసి ఏడడుగులు నడిచిన కట్టుకున్న భర్తను కనీస కనికరం లేకుండా చంపేసింది. ప్రియుడి మోజులో పడి తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను పక్కా ప్లాన్ తో ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య ఉదంతం కదిరిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్ల కదిరి పట్టణంలో నివాసం ఉంటున్న నాగభూషణం, ఈశ్వరమ్మ భార్యాభర్తలు. వీరు కొన్ని సంవత్సరాలుగా కదిరి పట్టణంలో నివాసముంటున్నారు.

ఇటీవల నాగభూషణం భార్య ఈశ్వరమ్మకు ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేసే రవి కుమార్ కు పరిచయం ఏర్పడింది. అది కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. ఈ వ్యవహారం భర్త నాగభూషణంకు తెలియడంతో భార్య ప్రవర్తన మార్చుకోవాలని పలు సార్లు మందలించినప్పటికీ భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు. ఎలాగైనా తన భర్త అడ్డు తొలగించుకోవాలని భావించిన ఈశ్వరమ్మ ప్రియుడిని ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరూ కలిసి పక్కా  ప్లాన్ తో భర్త నాగభూషణం దారుణంగా హత్య చేసారు. గుట్టుచప్పుడు కాకుండా రాత్రి సమయంలో మనుషులతో ఆటోలో మృతదేహాన్ని కదిరి పట్టణ సమీపంలోని ముళ్ళ పొదల్లో మృతదేహాన్ని పూడ్చి ఏమి విరిగినట్లు నటిస్తూ భర్త గురించి అడిగిన బంధువులకు చెన్నైలో ఉన్నాడని చెబుతూ వచ్చింది.

చాలా రోజులు అదే సమాధానం చెబుతూ ఉండడంతో భార్య ఈశ్వరమ్మ ఏదో చేసిందని అనుమానించిన బంధువులు పోలీసులకు సమాచారం అందజేయడంతో పోలీసు తనదైన శైలిలో విచారించారు. దీంతో ఈశ్వరమ్మ ప్రియుడు రవికుమార్ కలిసి తన భర్తను చంపినట్లు అంగీకరించి మృతదేహాన్ని పూడ్చి పెట్టిన చోట చూపించడంతో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.  కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి దర్యాప్తు చేపట్టారు కదిరి పోలీసులు.