డబ్బుల కొసం కన్న బిడ్డలనే అమ్మకానికి...

డబ్బుల కొసం కన్న బిడ్డలనే అమ్మకానికి...

రాజేంద్రనగర్  దారుణం. డబ్బుల కొసం కన్న బిడ్డలనే అమ్మకానికి పెడుతున్నారు కసాయి తల్లిదండ్రులు. ఎకంగా తన రెండు నెలల చిన్నారిని డబ్బుల కోసం విక్రయించాడు తండ్రి సయ్యద్ హైదర్. తల్లి‌ నమాజ్ కు‌‌ వెళ్లడంతో‌ బిడ్డతో పరారయ్యాడు  సయ్యద్ హైదర్. నమాజ్ ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లి షహానా బేగం... ఇంట్లో పసికందు కనిపించక పోవడంత చుట్టూ పక్కల వెతికింది తల్లి. అయిన కుమారుడు ఎక్కడ కనిపించక పోవడంతో భర్త పై అనుమానం వచ్చి రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించింది షహానా బేగం‌‌. భర్త పై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. అయితే భర్త సయ్యద్ హైదర్ పై‌ కఠిన చర్యలు తీసుకోవాలని‌ పోలీసులను కోరింది భార్య.