భార్యకు ఎఫైర్ ఉందని... భర్త సీల్ వేశాడు... కానీ... !!
భార్య భర్తల మధ్య అన్యోన్యత ఎలా ఉండాలి అంటే తప్పనిసరిగా ఇద్దరి మధ్య అవగాహన ఉండాలి. ఎలాంటి దాపరికాలు ఉండకూడదు. ఒకరిపై ఒకరికి ప్రేమ, నమ్మకం ఉండాలి. అప్పుడే ఆ కాపురం కలకాలం సాగుతుంది. అలా కాకుండా ఒకరిపై ఒకరికి నమ్మకం లేకుండా అనుమానాలు ఉంటె ఆ కాపురం ఎక్కువకాలం నడవదు. నమ్మకం నడిచే బంధమే భార్యాభర్తల అనుబంధం.
అయితే, ఓ భర్త అతని భార్యపై అనుమానం కలిగింది. ఆ అనుమానం ఎలాంటి సంఘటనకు దారితీసింది అంటే... దాని గురించి వర్ణించడానికి కూడా పదాలు సరిపోనటువంటి విధంగా ప్రవర్తించాడు భర్త. భర్త వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపారం కోసం బయటకు ఊర్లకు వెళ్లి రెండు మూడు రోజులకు తిరిగి వస్తుంటాడు. అయితే, భార్యపై ఎందుకో భర్తకు సందేహం కలిగింది. ఎవరితోనో సంబంధం పెట్టుకుందేమో అనుకున్నాడు. అంతే బయటకు వెళ్లే సమయంలో ఆ భర్త భార్య మర్మాంగాలకు సీల్ లాంటి జిగురు పద్దార్థం అంటించాడు. ఆ భార్య జిగురు లాంటి పదార్ధంతో చాలా ఇబ్బందులు పడింది. వెంటనే హాస్పిటల్ కు వెళ్లగా అక్కడ డాక్టర్లు చెప్పిన విషయం విని షాక్ అయ్యింది. వెంటనే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
విషయం తెలుసుకున్న పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు. కానీ, భర్త మాత్రం పోలీసులతో ఫైటింగ్ కు దిగాడు. భార్య నలుగురితో అక్రమ సంబంధం పెట్టుకుందని, అందుకే ఇలా చేశానని బుకాయించాడు. కానీ, దానికి సంబంధించిన ఎలాంటి అధరాలు లేకపోవడంతో పోలీసులు భర్తను అరెస్ట్ చేశారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)