భర్త వలనే కరోనా సోకిందని... ఆ భార్య కేసు... 

భర్త వలనే కరోనా సోకిందని... ఆ భార్య కేసు... 

కరోనా మహమ్మారి అమెరికాతో సహా యూరప్ దేశాల్లో ఇంకా విజృంభిస్తూనే ఉన్నది. అమెరికాలోని క్యాలిఫోర్నియాలో కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. అత్యధిక మరణాలు కూడా ఈ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి.  ఇక ఇదిలా ఉంటె,క్యాలిఫోర్నియా రాష్ట్రంలో నివసించే 65 ఏళ్ల రాబర్ట్ కుసింబా అనే వ్యక్తి స్థానికంగా విక్టరీ వుడ్ వర్క్స్ కంపెనీలో వర్క్ చేస్తున్నాడు. విధుల నుంచి ఇంటికి వచ్చిన కొన్ని రోజులకు ఆయనకు కరోనా సోకింది.  భర్తకు కరోనా సోకిన కొన్ని రోజులకు భార్యకు కూడా కరోనా సోకింది.  కరోనా తీవ్రత పెరగడంతో వెంటిలేటర్ పై చికిత్స తీసుకున్నారు.  ఎట్టకేలకు కరోనా నుంచి కోలుకొని ఇంటికి వచ్చారు.  తనకు కరోనా సోకడానికి తన భర్త కారణం అని, అయితే, భర్తకు కరోనా సోకడానికి అతను పనిచేసే కంపెనీనే కారణం అని రాబర్ట్ భార్య కోర్టులో కేసు దాఖలు చేసింది.  సరైన ప్రమాణాలు పాటించకపోవడం, శానిటేషన్ చేయకపోవడం, కరోనా నిబంధనలు అనుసరించకపోవడం వలనే ఉద్యోగులకు కరోనా సోకిందని ఆమె కేసు దాఖలు చేసింది.  అయితే, ఈ కేసును కోర్టు విచారణకు స్వీకరిస్తుందా లేదా అన్నది చూడాలి.