కరోనాతో భర్త మృతి... తట్టుకోలేక భార్య ఆత్మహత్య...

కరోనాతో భర్త మృతి... తట్టుకోలేక భార్య ఆత్మహత్య...

కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే వుంది. ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. ఈ వైరస్ ఎవరిని వదలడం లేదు. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరికీ సోకుతోంది.సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ఈ కరోనా ఎవరినీ వదలడం లేదు. అయితే హైదరాబాద్ నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబెడ్కర్ నగర్ కు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి కరోనా వ్యాధితో మరణించాడు. భర్త మరణం తట్టుకోలేని భార్య ధనలక్ష్మి (55) గృహిణి తాము నివసిస్తున్న బిల్డింగ్ పైనుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న నేరేడ్మెట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.