జియో సైతం షేక్ కావాల్సిందే..? రూ.1కే 1 జీబీ డేటా..!

జియో సైతం షేక్ కావాల్సిందే..? రూ.1కే 1 జీబీ డేటా..!

టెలికం మార్కెట్‌లో రిలయన్స్ జియో ఓ సంచలనం... అన్ని ఉచితం అంటూ టెలికం మార్కెట్‌లో అడుగుపెట్టి.. మిగతా అన్ని టెలికం సంస్థలు కూడా దిగివచ్చేలా చేసింది... ఆ తర్వాత టారీప్ ప్రకటించి ప్లాన్స్ తీసుకొచ్చినా.. జియో క్రమంగా చందాదారులను పెంచుకుంటూనే ఉంది. అయితే, జియో సైతం షేక్ అయ్యే ప్లాన్‌తో మార్కెట్‌లోకి వచ్చింది బెంగళూరుకు చెందిన స్టార్టప్‌ కంపెనీ వైఫై డబ్బా.. మొబైల్‌ ఫోన్‌ వినియోగదారులకు కేవలం రూ.1 కే.. ఒక జీబీ డేటాను అందించనున్నట్టు సంచలన ప్రకటన చేసింది. వైఫై డబ్బా సీఈవో కంరం లక్ష్మణ్‌..  ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే, మొదట ప్రయోగాత్మకంగా బెంగళూరులో ఆ ప్లాన్ అందుబాటులో ఉండగా.. అక్కడ విజయవంతమైతే.. త్వరలోనే దేశవ్యాప్తంగా అమలు చేయనున్నట్టు వెల్లడించారు. 

మొబైల్‌ ఫోన్లలో ఓటీపీ ఎంటర్‌ చేయడంతో ‘వైఫై డబ్బా’కు ఎవరైనా కనెక్ట్‌ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా.. టీ షాపులు, వ్యాపార కూడళ్లలో ప్రీపెయిడ్‌ కూపన్ల ద్వారా కూడా డేటా సేవలను పొందే అవకాశం కల్పిస్తున్నారు. ఇది జియోకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉందంటున్నారు... ఇది 2017 సంవత్సరం నుండి సేవలు అందిస్తోంది. అంతకుముందు 20 రూపాయలకు 1 జీబీ డేటా లభించింది. ఓ నివేదిక ప్రకారం, ఇప్పుడు వైఫై దబ్బాలో ఒక రూపాయికి ఒక జీబీ డేటా అందుబాటులో ఉంది. ఆ సంస్థ నుంచి ఇప్పుడు మూడు ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి.. రూ.2కు 1 జీబీ డేటా, రూ.10కు 5 జీబీ డేటా, రూ.20కు 10 జీబీ డేటా ప్లాన్‌లు లభిస్తున్నాయి. ఈ అన్ని ప్లాన్లు చెల్లుబాటు సమయం 24 గంటలు ఉంటుంది. అయితే, వైఫై డబ్బా ఇంత చౌక డేటాను ఎలా ఇస్తోంది? అనే అనుమానం కలగొచ్చు.. వైఫై డబ్బా తన వై-ఫై రౌటర్‌ను టీ మరియు స్థానిక దుకాణాలలో ఏర్పాటు చేసింది. సంస్థ యొక్క ఈ భావన యొక్క పేరు సూపర్నోడ్స్. ఈ సూపర్‌నోడ్‌ల ద్వారా సెకనుకు 100 జీబీ చొప్పున 20 కిలోమీటర్ల వరకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించవచ్చు. అదే సంస్థ తన రౌటర్ కోసం డబ్బా అనే ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా అభివృద్ధి చేసింది. దీనితో, సంస్థ ఇప్పుడు ఈ ప్రాజెక్టును అపార్ట్మెంట్ మరియు సొసైటీకి తీసుకెళ్లాలని యోచిస్తోంది. కంపెనీ వై-ఫై కోసం ఎటువంటి కేబుల్ వేయలేదు లేదా ప్రభుత్వం నుండి స్పెక్ట్రం కొనుగోలు చేయలేదు.