వికిలీక్స్ అసాంజెకు జైలుశిక్ష

వికిలీక్స్ అసాంజెకు జైలుశిక్ష

వికిలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజెకు బుధవారం లండన్ కోర్ట్ 50 వారాల జైలు శిక్ష విధించింది. ఏడేళ్ల క్రితం ఈక్వెడార్ రాయబార కార్యాలయంలోకి ప్రవేశించేందుకు బెయిల్ నియమాలు ఉల్లంఘించినందుకు అసాంజెకు ఈ శిక్ష పడింది.  

గత నెల అసాంజెను ఈక్వెడార్ రాయబార కార్యాలయం నుంచి బయటికి ఈడ్చుకొచ్చారు. అత్యంత గోపనీయ సమాచారాన్ని లీక్ చేశాడని అమెరికా ఆయనపై ఆరోపణలు చేసింది. రేప్ ఆరోపణలపై స్వీడన్ కి అప్పగింత ఆదేశాలు ఇచ్చిన తర్వాత 2012లో బెయిల్ ఉల్లంఘించినందుకు గత నెల ఆయనను దోషిగా నిర్ధారించారు.