జగన్ ప్రమాణస్వీకారానికి బాబు వెళతారా..?

జగన్ ప్రమాణస్వీకారానికి బాబు వెళతారా..?

ఈనెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైసీపీ అధినేత జగన్‌..  మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు స్వయంగా ఫోన్‌ చేసి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో.. ప్రమాణస్వీకారానికి హాజరుకావాలా లేదా అనే విషయమై ఇవాళ జరిగే టీడీఎల్పీ భేటీలో చర్చించబోతున్నారు. చంద్రబాబునాయుడే హాజరుకావాలా లేక పార్టీ తరఫున ఎవరినైనా పంపాలా అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. 

తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలను జగన్ ఆహ్వానించారు. తాము విచ్చేస్తామని కేసీఆర్, స్టాలిన్‌లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. 2014లో చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో జగన్‌ను ఫోన్ చేసి ఆహ్వానించారు. కానీ.. జగన్‌ ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఆ పార్టీ నేతలెవరూ కూడా హాజరుకాలేదు.