కమెడియన్ గా సునీల్ హవా మళ్ళి మొదలౌతుందా..?
కమెడియన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సునీల్, బ్రహ్మానందం నుంచి పోటీని తట్టుకొని నిలబడ్డాడు. మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. అనంతర కాలంలో సునీల్ దృష్టి హీరోపై పడటంతో.. హీరోగా మారిపోయాడు. హీరోగా మారిన కొత్తల్లో చేసిన సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. ఎప్పుడైతే సునీల్ మాస్ హీరోగా మారిపోయాడో అప్పుడే.. సునీల్ ప్రభ తగ్గిపోవడంమొదలుపెట్టింది. ఇప్పుడు హీరోగా చేతిలో సినిమాలో లేకపోవడంతో.. తిరిగి కమెడియన్ గా తన ప్రస్థానాన్ని కొనసాగించడానికి సిద్దమయ్యాడు.
ఎన్టీఆర్ హీరోగా వస్తున్న అరవింద సమేతలో కమెడియన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరో నాలుగైదు సినిమాలు చేతిలో ఉన్నాయి. గతంలో సినిమాను బట్టి రెమ్యునరేషన్ తీసుకున్న సునీల్ ఇప్పుడు కాల్షీట్ ను బట్టి రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట. రోజుకు రూ.3.5 లక్షల పారితోషికాన్ని అందుకుంటున్నట్టు సమాచారం. అరవింద సమేతలో ఎన్టీఆర్ కు క్లోస్డ్ ఫ్రెండ్ గా నటిస్తున్నాడు. ఎలాగో త్రివిక్రమ్ కు సునీల్ మంచి స్నేహం ఉంది కాబట్టి ఈ సినిమాలో సునీల్ పై పంచ్ కామెడీ డైలాగులు ఉండనే ఉంటాయి. ఇందులో సునీల్ కామెడీ ఎలా ఉంటుందో చూడాలి అంటే దసరా వరకు ఆగాల్సిందే.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)