నీరవ్ మోదీ సంచలన వ్యాఖ్యలు.. నన్ను భారత్‌కు పంపితే....!

నీరవ్ మోదీ సంచలన వ్యాఖ్యలు.. నన్ను భారత్‌కు పంపితే....!

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బెదిరింపులకు దిగుతున్నాడు.. పంజాబ్ నేషనల్ బ్యాంకుని రూ.13,500 కోట్ల మేర టోపీ పెట్ట లండన్‌కు చెక్కేసిన ఆయన.. ప్రస్తుతం లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైల్లో ఉన్నాడు. అయితే, ఆయన బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు అన్నీ బెడిసికొడుతూనే ఉన్నాయి.. తాజాగా, తాను మానసికంగా కుంగుబాటుకు గురవుతున్నానంటూ బెయిల్ కోసం నీరవ్ మోడీ పిటిషన్ వేయగా.. సంబంధిత పిటిషన్‌ను లండన్ కోర్టు కొట్టివేసింది. ఆయన బెయిల్ కోసం ప్రయత్నించి విఫలం కావడం ఇది వరుసగా నాలుగోసారి కావడంతో మోదీకి చిర్రెత్తుకొస్తున్నట్టుంది. ఇక, తన పూచీకత్తు మొత్తాన్ని నాలుగు మిలియన్ల పౌండ్ల మేర రెండింతలు పెంచినా, హౌస్ అరెస్టుకు సైతం ఒప్పుకున్నప్పటికీ బెయిల్ ఇచ్చేందుకు మాత్రం అంగీకరించడంలేదు కోర్టు.. ఇదే సందర్భంలో నీరవ్ మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.. తనను ఒకవేళ భారత్‌కు తిప్పిపంపితే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరిస్తున్నారు.. అయితే, మోదీ బెయిల్ పిటిషన్‌పై విచారణ డిసెండర్ 4వ తేదీకి వాయిదా పడింది. కాగా, పీఎన్బీ స్కామ్‌ కేసులో నీరవ్ మోదీ, అతడి మేనమామ మెహుల్ చోక్సీ ప్రధాన నిందితులుగా ఉండగా.. నీరవ్ మోదీ మార్చి 19న యూకేలోని స్కాట్‌లాండ్ యార్డ్‌లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.