అభినందన్ విషయం రెండ్రోజుల్లో తేలుస్తాం 

అభినందన్ విషయం రెండ్రోజుల్లో తేలుస్తాం 

భారతీయ పైలట్ విషయం మరో రెండ్రోజుల్లో తేలుస్తామని పాకిస్థాన్ వెల్లడించింది. తమ అదుపులో ఉన్న పైలట్ అభినందన్ ప్రస్తుతం సురక్షితంగా, ఆరోగ్యంగా ఉన్నారని పాక్ విదేశీ వ్యవహారాల ప్రతినిధి మహమ్మద్ ఫైసల్ స్పష్టం చేశారు. పైలట్ కు సంబంధించిన విషయం భారత్ పదే పదే లేవనెత్తుతుందన్నారు. పైలట్ కు ఎలాంటి శిక్షలు వేయాలీ అని మరో రెండ్రోజుల్లో తేలుస్తామని వెల్లడించారు. అభినందన్ విషయంలో ఏం చేయాలనేది కొద్దిరోజుల్లో నిర్ణయిస్తామని... అభినందన్‌ను యుద్ధ ఖైదీగా పరిగణించాలా.. వద్దా అనే అంశంపై కూడా త్వరలో నిర్ణయం తీసుకుంటామని పైజల్ స్పష్టం చేశారు. వింగ్ కమాండర్ అభినందన్‌ను పాకిస్థాన్ ఆర్మీ ఇబ్బంది పెడుతుందని భారత రక్షణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో పైజల్ ఈ ప్రకటన చేసినట్లు తెలిసింది.