సాహో బరువును ఆయన మోయగలడా..!!

సాహో బరువును ఆయన మోయగలడా..!!

ఎన్నో అంచనాలతో ఆగష్టు 15 వ తేదీన సాహో రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ అందరిని ఆకట్టుకుంది.  ఈ టీజర్ కు బీజీయం ఇచ్చింది జిబ్రాన్.  ఇదిలా ఉంటె, సాహో సినిమా మొత్తానికి జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారట.  దీన్ని ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు.  

ఇది భారీ ప్రాజెక్ట్.. ఇలాంటి థ్రిల్లింగ్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రాణం. సుజిత్ దర్శకత్వం వహించిన రన్ రాజా రన్ సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ అందించారు.  ఆ తరువాత తెలుగులో సినిమాలు లేవు.  తమిళంలో రట్ససన్ సినిమాకు మ్యూజిక్ అందించారు.  దీనికి సంబంధించిన బీజేఎం ఎలా ఉంటుందో తెలిసిందే కదా. 

రట్ససన్ సినిమాను రాక్షసుడుగా రీమేక్ చేస్తున్నారు.  దీనికి జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.  ఈ మ్యూజిక్ ఎలా ఉంటుందో చూస్తే ప్రభాస్ సాహో కు ఎలా ఇవ్వబోతున్నాడో అర్ధం చేసుకోవచ్చు.