రెండో టెస్ట్ లోను భారత్ కు ఓటమి తప్పదా? 

రెండో టెస్ట్ లోను భారత్ కు ఓటమి తప్పదా? 

క్రైస్ట్ చర్చ్ లో ఇండియా న్యూజిలాండ్ దేశాల మధ్య రెండో టెస్ట్ జరుగుతున్నది.  మొదటి టెస్ట్ లో ఓటమి పాలైన ఇండియా రెండో టెస్ట్ లో కూడా అదే దిశగా అడుగులు వస్తుందా అంటే అవుననే అంటున్నాయి సంకేతాలు.  మొదటి ఇన్నింగ్ లో తక్కువ పరుగులకే ఆలౌటైనా ఇండియా జట్టు రెండో ఇన్నింగ్స్ లో కూడా అదే బాటలో నడిచింది.  

రెండో ఇన్నింగ్స్ లో ఇండియా జట్టు కేవలం 124 పరుగులకే ఆలౌట్ అయ్యింది.  దీంతో కివీస్ ముందు 132 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచింది.  కాగా, తాజా సమాచారం ప్రకారం 20 ఓవర్లలో 74 పరుగులు చేసి గెలుపు దిశగా అడుగులు వేస్తుంది.  లక్ష్యం చిన్నదిగా ఉండటం చేతిలో పది వికెట్లు ఉండటంతో విజయం ఖాయంగా కనిపిస్తోంది.  టి 20 సిరీస్ ను గెలిచిన ఇండియా జట్టు వన్డే, టెస్ట్ సీరీస్ ను కోల్పోయేలా కనిపిస్తున్నది.  ఈ టెస్ట్ మ్యాచ్ లో టాప్ ఆర్డర్ తో పాటుగా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా దారుణంగా విఫలం అవుతూ వస్తుండటం కలవరపెడుతున్నది.