దబాంగ్ 3 లో కరీనా..?

దబాంగ్ 3 లో కరీనా..?

సల్మాన్ ఖాన్ దబాంగ్ సినిమా ఎలాంటి హిట్ కొట్టిందో చెప్పక్కర్లేదు.  2010 లో వచ్చిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.  ఇటు తెలుగులో ఆ సినిమాను పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ గా రీమేక్ చేశారు.  ఆ తరువాత బాలీవుడ్ లో దబాంగ్ 2 వచ్చింది.  అదికూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది.  దానికి కొనసాగింపుగా దబాంగ్ 3 చేస్తారా లేదా అనుకుంటున్న సమయంలో ఆ రూమర్స్ కు చెక్ పెడుతూ.. దబాంగ్ 3 చేస్తున్నట్టు, ఏప్రిల్ మొదటి వారం నుంచి సినిమా ప్రారంభం కాబోతున్నట్టు నిర్మాత అర్భాజ్ ఖాన్ పేర్కొన్నాడు.  

దబాంగ్ సీరీస్ హీరోయిన్ సోనాక్షి సిన్హానే ఇందులో హీరోయిన్ గా చేస్తోంది.  ఈ విషయాన్ని ఇప్పటికే నిర్మాత అర్భాజ్ ఖాన్ స్పష్టం చేశాడు.  దబాంగ్ రెండు సినిమాల్లోనూ స్పెషల్ ఐటెం సాంగ్ ఉంది.  మూడో సినిమాలో కూడా తప్పకుండా ఉండే ఉంటుంది.  ఈ  స్పెషల్ సాంగ్ లో కరీనా స్టెప్స్ వేస్తుందని వార్తలు వస్తున్నాయి.  ఈ వార్తలపై నిర్మాత అర్భాజ్ ఖాన్ స్పందించాడు.  కరీనా స్పెషల్ సాంగ్ చేస్తుందని దాంట్లో వాస్తవం లేదని.. ఇంతవరకు ఈ విషయంలో ఎవరిని సంప్రదించలేదని అన్నారు.