రూ. 100 కోట్లకు చేరువలో... కంగనా..!!

రూ. 100 కోట్లకు చేరువలో... కంగనా..!!

కంగనా రనౌత్ మణికర్ణికా సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ అయ్యింది.  సినిమా బాగుందనే టాక్ వచ్చినా.. ప్రమోషన్స్ లేకపోవడంతో కలెక్షన్స్ పై ప్రభావం పడింది.  మొదటి వారంలో ఈ సినిమా రూ.61.15 కోట్లు చేయగా రెండో వారంలో రూ.23.40  కోట్లు వసూలు చేసింది.  ఫస్ట్ వీక్ ఫాస్ట్ గా వచ్చిన వసూళ్లు, రెండో వారం దగ్గరికి వచ్చే సరికి సడెన్ డౌన్ ఫాల్ అయ్యాయి.  

మూడో వారంలో మొదటి రోజు కలెక్షన్లు పర్వాలేదనిపించడం విశేషం.  పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ కాకపోవడం మణికర్ణికాకు కలిసి వచ్చింది.  ఇప్పటి వరకు ఈ సినిమా రూ.91.70 కోట్లు వసూలు చేసింది.  ఈ వారాంతారని రూ.100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరుతుందని అంచనా వేస్తున్నారు.  సినిమాకు ప్రమోషన్ ఉన్నట్టయితే.. ఈపాటికి మణికర్ణికా రూ.200 కోట్ల రూపాయల క్లబ్ లో చేరి ఉండేది.