పెద్దదిక్కుగా మోహన్ లాల్ పక్కానా?

పెద్దదిక్కుగా మోహన్ లాల్ పక్కానా?

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ప్రధాని మోడీని మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కలుసుకోవడం చర్చాంశంగా మారింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో కేరళలోని తిరువనంతపురం సీటు నుంచి మోహన్ లాల్ పోటీ చేసే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నేత శశిథరూర్ కు చెక్ పెట్టడానికే ఆ స్థానం నుంచి మోహన్ లాల్ ను బరిలోకి దింపేందుకు ఆర్ఎస్ఎస్ నేతలు వ్యూహం పన్నారన్న టాక్ వినిపిస్తోంది. 

కేరళలో బీజేపీ ఓట్ల శాతాన్ని పెంచుకున్నా.. ప్రాతినిధ్యం మాత్రం రాబట్టలేకపోయింది. ఎమ్మెల్యే ఓ.రాజగోపాల్ మినహా ఆ పార్టీకి మరో లీడర్ కనిపించడం లేదు. ఇక బీజేపీలో ఉన్న మరో ప్రముఖ నటుడు సురేశ్ గోపీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి ప్రచారం కూడా చేశారు. ఆయనతో పాటు ఇప్పుడు మోహన్ లాల్ గనక చేరితే బీజేపీకి కేరళలో సినీ గ్లామర్ పెరగడం ఖాయంగా చెబుతున్నారు. పాల్గొన్నారు. పెద్దనోట్ల రద్దును స్వాగతించినవారిలో మోహన్ లాల్ కూడా ఉన్నారు.

మోడీ-మోహన్ లాల్ మీటింగ్ తరువాత కేరళకు సాయంపై ప్రస్తావనకు రావడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. తన ఆధ్వర్యంలో నడుస్తున్న విశ్వశాంతి ఫౌండేషన్ కార్యకలాపాల గురించి మోడీకి చెప్పానన్నారు. కేరళకు ఆపన్న హస్తం అందించేందుకు త్వరలో జరుగనున్న గ్లోబల్ మలయాళీ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనేందుకు మోడీ ఉత్సాహం చూపారని, కేరళ పునర్నిర్మాణం కోసం శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారని, కేన్సర్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయిస్తానన్నారని మోహన్ లాల్ ట్వీట్ చేశారు.