సవ్యసాచి గట్టిగా కొట్టేస్తాడా..!!

సవ్యసాచి గట్టిగా కొట్టేస్తాడా..!!

నాగచైతన్య సవ్యసాచి సినిమా నవంబర్ 2 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  పెద్ద సినిమాలు ఏవీ కూడా రిలీజ్ కు లేకపోవడంతో భారీ ఎత్తున ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది.  పైగా సినిమాకు పాజిటివ్ బజ్ నడుస్తుండటం ఈ సినిమాకు ప్లస్.  

 నాగ చైతన్య కెరీర్లో అత్యధిక ఓపెనింగ్ రాబట్టిన సినిమా శైలజ రెడ్డి అల్లుడు.  సినిమా హిట్ టాక్ వచ్చినప్పటికి అనుకున్న విధంగా వసూళ్లు రాబట్టలేకపోయింది.  చిన్న చిన్న హీరోలు రూ.50, రూ. 100 కోట్ల క్లబ్లో చేరిపోతుంటే అక్కినేని హీరో నాగచైతన్యకు కూడా అది ఒక కలగానే మిగిలిపోయింది. 

కథ పరంగా ఈ సినిమా కొత్తగా ఉండటంతో పాటు చైతుని మాస్ హీరోగా చూపించబోతున్నారు కాబట్టి ఈ సినిమా ద్వారా నాగచైతన్య కల నెరవేరే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.  మరి చైతు కల నెరవేరుతుందో లేదో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.