నాగచైతన్య కెరీర్ను మజిలీ మారుస్తుందా?

నాగచైతన్య కెరీర్ను మజిలీ మారుస్తుందా?

నాగచైతన్య చాలా కాలం నుంచి హిట్ లేక ఇబ్బందులు పడుతున్నాడు.  హిట్ అవుతుంది అనుకున్న సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.  దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో నాగచైతన్య ఉన్నాడు.  ఇప్పుడు అదే స్పీడ్ తో పనిచేస్తున్నట్టు కనిపిస్తున్నాడు.  మజిలీ సినిమా అలాంటి అంచనాలను క్రియేట్ చేసింది.  

నాగచైతన్య.. సమంత జంటగా నటిస్తున్న మజిలీ సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.  దీనికి తగ్గట్టుగా టీజర్, నిన్ననే రిలీజైన ట్రైలర్ లు ఉండటంతో అంచనాలు పెరిగాయి.  మరో నాలుగు రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయబోతుండటంతో సినిమాను ప్రమోషన్స్ చేసేందుకు యూనిట్ సిద్ధం అయ్యింది.  ఏం మాయ చేశావే, మనం తరువాత ఆ రేంజ్ లో సినిమా హిట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  మరి రిలీజ్ తరువాత ఇదే అంచనాలను అందుకుంటే చైతు కెరీర్ మరలా గాడిలో పడ్డట్టే అవుతుంది.