ఎన్జీకే సూర్య ను నిలబడుతుందా..?

ఎన్జీకే సూర్య ను నిలబడుతుందా..?

కోలీవుడ్ హీరో సూర్య ఎన్జీకే సినిమా ట్రైలర్, సాంగ్స్ ఈరోజు రిలీజ్ కాబోతున్నాయి.  గజినీ, సింగం సిరీస్ తో పాపులరైనా ఈ హీరో, గత కొంతకాలంగా మంచి హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు.  తమిళంలో ఎలా ఉన్నా.. తెలుగులో మాత్రం మార్కెట్ పరంగా కొంత వెనకబడ్డాడు సూర్య.  ఎన్జీకే తో సూర్య కమ్ బ్యాక్ అవుతాడని అంచనా వేస్తున్నారు.  

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సెల్వరాఘవన్ దర్శకుడు.  ఇప్పటికే రిలీజైన టీజర్ మంచి హైప్ ను క్రియేట్ చేసినా... దానికి తగ్గట్టుగా జనాల్లో మాట వినిపించడంలేదు.  మరి ట్రైలర్ రిలీజ్ తరువాత హైప్ క్రియేట్ అవుతుందేమో చూడాలి.