రిజల్ట్ తరువాత పవన్ సినిమాల్లో నటిస్తారా..?

రిజల్ట్ తరువాత పవన్ సినిమాల్లో నటిస్తారా..?

పవన్ కళ్యాణ్ కు సినిమా ఇండస్ట్రీలో ఓ క్రేజ్ ఉంది.  పవన్ సినిమాలంటే చెవికోసుకునే అభిమానులు లక్షలాది మంది ఉన్నారు.  అజ్ఞాతవాసి తరువాత పవన్ రాజకీయాల్లో బిజీ అయ్యారు.  ఎన్నికలు ముగిసిన అనంతరం పవన్ కళ్యాణ్ కెనడా వెళ్లిన సంగతి తెలిసిందే.  పదిరోజులు అక్కడ గడిపిన తరువాత ఈరోజు హైదరాబాద్ తిరిగి వచ్చారు.  

ఈరోజు నుంచి పార్టీ పనుల్లో బిజీగా ఉంటారని సమాచారం.  రిజల్ట్ తరువాత పవన్ తిరిగి సినిమాల్లో నటిస్తారా లేదా అన్నది ఇప్పుడు అందరి మనసుల్లో ఉన్న ప్రశ్న.  సినిమాల్లో నటించే అవకాశం లేదని పవన్ గతంలోనే చెప్పినా... అభిమానులు దర్శక నిర్మాతలు ఫోర్స్ చేస్తే... తిరిగి సినిమాల్లో కనిపించే అవకాశం ఉండొచ్చని కొందరి అభిప్రాయం.