రాధేశ్యామ్ టీజర్ వచ్చేది అప్పుడేనా..?

రాధేశ్యామ్ టీజర్ వచ్చేది అప్పుడేనా..?

రెబల్ స్టార్ ప్రభాస్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ జాతీయ స్థాయి స్టార్‌గా ఎదిగారు. ఆ తరువాత వరుస భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ పూర్తి చేసిన సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమా టీజర్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. అయితే వారికి తీపి కబురు అందిందనే చెప్పాలి. వచ్చే వారంలో రాధేశ్యామ్ టీజర్ రిలీజ్ అనౌన్స్‌మెంట్ చేయనున్నారంట. ఈ మేరకు వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అంతేకాకుండా పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఈ సినిమా టీజర్‌ను లవర్స్ డే రోజున విడుదల చేస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మరి లవర్స్ డే రోజున ప్రభాస్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తారన్న విషయం ఎంతవరకు నిజమనేది తెలియాలంటే కాస్త సమయం ఆగాల్సిందే.