ఆ రెండు తరువాత సినిమాలకు రజిని గుడ్ బై...?

ఆ రెండు తరువాత సినిమాలకు రజిని గుడ్ బై...?

రజినీకాంత్... సౌత్ లోనే కాదు ఇండియా మొత్తానికి బాగాపరిచయం ఉన్న పేరు.  రజినీకాంత్ సినిమా వస్తుంది అంటే అది పెద్ద పండుగలా జరుపుకుంటారు. ఇలా పండుగలా చేసుకుంటుంటారు. 2పాయింట్ 0, పెట్ట తరువాత మురుగదాస్ తో సినిమా మొదలుపెట్టాడు రజిని.  ఏప్రిల్ 10 వ తేదీ నుంచి సినిమా ప్రారంభం అయ్యింది.  దీని తరువాత రజినీకి బాగా సన్నిహితమైన దర్శకుడు కెఎస్ రవికుమార్ తో సినిమా చేస్తారట.  దీంతో పాటు వినోద్ అనే దర్శకుడితో ఓ సినిమా ఉంటుంది.  కెఎస్ రవికుమార్, వినోద్ సినిమాలను వచ్చే ఏడాది సమ్మర్ వరకు కంప్లీట్ చేయాలని రజిని కండిషన్ పెట్టినట్టు సమాచారం.  

మురుగదాస్ సినిమాతో పాటు ఆ రెండు సినిమాలు పూర్తికాగానే సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి రావాలని రజిని అనుకుంటున్నారని సమాచారం.  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయానికి రజినీకాంత్ పార్టీని పూర్తిగా బలోపేతం చేసి తమిళనాడులో పోటీ చేయాలని భావిస్తున్నారని సన్నిహిత వర్గాల సమాచారం.  ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  రజినీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారు అని తెలియగానే అభిమానులు అప్పుడే కంగారు పడటం స్టార్ట్ చేశారు.  ఇది అధికారికమైన న్యూస్ కాదు కాబట్టి పెద్దగా కంగారు పడవలసిన అవసరం లేదు.