నితిన్ ప్లాఫ్‌ సెంటిమెంట్ ను 'రంగ్ దే' బ్రేక్ చేస్తుందా!?

నితిన్ ప్లాఫ్‌ సెంటిమెంట్ ను 'రంగ్ దే' బ్రేక్ చేస్తుందా!?

హీరో నితిన్ కెరీర్ జయాపజయాలకు అతీతంగా సాగుతోంది. వరుస ప్లాప్స్ వచ్చిన ప్రతి సారీ ఎదో ఒక హిట్ పడి ఆదుకుంటూ వస్తోంది. 'గుండె జారి గల్లంతయిందే' తర్వాత 'హార్ట్ ఎటాక్, చిన్నదాన నీకోసం, కొరియర్ బోయ్ కళ్యాణ్'తో హ్యాట్రిక్ ప్లాఫ్స్ ఫేస్ చేశాడు. ఆ తర్వాత 'అ ఆ'తో బంపర్ హిట్ కొట్టాడు. మళ్ళీ 'లై, చల్ మోహన్ రంగా, శ్రీనివాస కళ్యాణం'తో మరోసారి ఫ్లాప్స్ తో మరో హాట్రిక్ కొట్డాడు. గత ఏడాది 'భీష్మ'తో కెరీర్ బెస్ట్ హిట్ సాధించాడు.

కరోనా తర్వాత ఈ ఏడాది వచ్చిన 'చెక్' సినిమా మరోసారి నితిన్ పరాజయాలకు నాంది పలికింది. దీంతో అందరి కళ్ళూ రాబోయే 'రంగ్ దే'పై ఉన్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అయితే రంగ్ దే బిజినెస్ మాత్రం ఎప్పుడో క్లోజ్ అయింది. 'భీష్మ' టైమ్ లో బిజినెస్ పూర్తి చేశారు. కానీ ఇప్పుడు 'చెక్' తర్వాత వస్తుండటంతో బయ్యర్లలో ఆందోళన ఉన్నప్పటికీ 'రంగ్ దే' తీసింది 'అ ఆ, భీష్మ' వంటి హిట్స్ ఇచ్చిన బ్యానర్ కావటంతో మంచి హోప్ పెట్టుకున్నారు. 'చెక్' ఎఫెక్ట్ 'రంగ్ దే' పై పడదని నమ్ముతున్నారు. నితిన్ తో కీర్తి సురేశ్ నటించిన 'రంగ్ దే' పాటలకు మంచి స్పందన రావటం కూడా కలసి వచ్చే అంశమే. మరి నితిన్ ప్లాఫ్ సెంటిమెంట్ ను 'రంగ్ దే' బ్రేక చేస్తుందేమో చూద్దాం.