ప్రధాని అనుమతి లేకుండానే మార్చారా?

ప్రధాని అనుమతి లేకుండానే మార్చారా?
వివాదాస్పద పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా వ్యవహారం దేశ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. మాల్యా పారిపోవడానికి సీబీఐ అవలంబించిన మెతక వైఖరే కారణమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. విజయ్ మాల్యాపై సీబీఐ జారీ చేసిన తొలి నోటీసులో మాల్యాను అదుపులోకి తీసుకోవాలని కోరారు. తరవాతి నోటీసులో మాత్రం మాల్యా గురించి సమాచారం (విదేశాలకు వెళుతుంటే ) మాత్రం ఇవ్వమని పేర్కొన్నారు. సీబీఐ నేరుగా ప్రధాని ఆధ్వర్యంలోనే నడిచే సంస్థ అని, ఇలాంటి వివాదాస్పద, ప్రముఖ కేసులో ప్రధానితో ఆమోదం లేకుండానే నోటీసును మార్చారనడం నమ్మశక్యంగా లేదని రాహుల్ అన్నారు.