అంతులేని కథలో...  వర్మ మరో ట్విస్ట్‌ ఉంటుందా?

అంతులేని కథలో...  వర్మ మరో ట్విస్ట్‌ ఉంటుందా?
గత కొన్ని రోజులుగా నివురు గప్పిన నిప్పులా ఉన్న గుట్టంతా ఒక్కసారిగా బయట పడింది. 24 గంటలు కూడా గడవకముందే మొత్తం తెర వెనుక వ్యవహారాలు టీవీ సాక్షిగా తెలుగు ప్రజల ముందు సాక్షాత్కరించాయి. తనకు అవకాశం ఇవ్వడం లేదని క్యాస్టింగ్‌ కౌచ్‌ తో శ్రీరెడ్డి మొదలు పెట్టిన ఈ గొడవ ఇవాళ అల్లు అరవింద్‌ ప్రెస్‌ మీట్‌తో క్లైమాక్స్ కు చేరిందనాలి. చిన్న ఆర్టిస్టుల సమస్యగా మొదలైన ఈ వ్యవహాంలో పెద్దల జోక్యంతో కథ రంజుగా మారింది. శ్రీరెడ్డి స్టోరీ కొనసాగింపు కంటే... క్లయిమాక్స్‌ ఎలా ఉంటుందని ఆసక్తిగా చూస్తున్న తెలుగు పాఠకులు, ప్రేక్షకులకు బుధవారం రాత్రి వర్మ వీడియో ఓ కీలక మలుపు. తరువాత జరిగిన ఘటనలను బట్టి చూస్తే... తెర వెనక బాగోతం త్వరలోనే తెర ముందుకు వస్తుందని గ్రహించిన వర్మ తానే ముందుగా వీడియో పెట్టి .. డ్యామేజి కంట్రోల్‌ కోసం తంటాలు పడ్డారు. నాగబాబు ఇచ్చిన వార్నింగ్‌ ఫైనల్‌ అని అనుకున్న వారికి వర్మ ట్వీట్‌ తర్వాత ఇదేదో పెద్ద గొడవేనని అనకుంటున్న సమయంలో మధ్యాహ్నం అల్లు అరవింద్‌ మీడియా సమావేశం ఉందని వార్త గుప్పుమనేసరికే... ఇక వర్మపై భారీ దాడి ఖాయమని అర్థమైపోయింది. కాగా ఊహించినట్లే అల్లు అరవింద్‌ ఫైర్‌ కావడంతోపాటు వర్మకు తీవ్ర వార్నింగ్‌ ఇచ్చారు. పరిశ్రమకు ఓ టార్గెట్‌ ఇచ్చారు. ఇంత నీచమైన పనులకు ఒడిగట్టిన వర్మకు పరిశ్రమ ఎలా స్పందిస్తుందోనంటూ ఇది అంతులేని కథగా తేల్చారు. మొత్తానికి పవన్‌ పొలిటికల్‌ ఎంట్రీ తర్వాత ఆయనను టార్గెట్‌ చేసకుని ఏం జరిగినా.. రాజకీయ నేతలు కూడా జాగ్రత్తగా గమనిస్తున్నారు. వర్మ చర్యను మెగా ఫ్యామిలీపై కుట్రగా అభివర్ణించిన అల్లు అరవింద్‌... ఇలాంటిది పదేళ్ళ క్రితమే ప్రజారాజ్యంలో చూశామని.. పాత రోజులు గుర్తు చేశారు. ఇదంతా జరుగుతున్న సమయంలో శ్రీరెడ్డి ఆత్మహత్యాయత్నం చేసిందనే వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఈ వ్యవహారానికి ఫుల్‌ స్టాప్‌ పడిందా? లేదా ఈ ఎపిసోడ్ కు వర్మ కొత్త మలుపు ఇస్తాడా... ముంబై నుంచి వర్మ ట్వీట్‌ చెప్పాల్సిందే.. సారీ.. ఇపుడు వర్మ ట్వీట్‌ నుంచి మళ్ళీ వీడియోల్లో వస్తున్నాడు... సో వెయిట్‌ ఫర్‌ వర్మ వీడియో....