దగ్గుపాటి మల్టీస్టారర్ వచ్చేనా..

దగ్గుపాటి మల్టీస్టారర్ వచ్చేనా..

అబిమాన కథానాయకులు ఒకే తెరపై కనిపిస్తే చాడాలిన అభిమానులు కోరుకుంటారు. అందులోనూ ఒకే కుటుంబీకులైతే ఆ కిక్కే వేరంటారు. ప్రస్తుతం తెలుగు చిత్ర సీమలో అగ్ర కుంటుంబాలు మెగా ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, ఘట్టమనేని కుటుంబం, దగ్గుపాటి కుంటుంబాలు ప్రధానంగా చెప్పుకోవాల్సినవి. అయితే వీటిలో అందరూ తమతమ కుటుంబీకులతో కలిసి చేసి సినిమాలు ఉన్నాయి. మనం సినిమాలో అక్కినేని కుటుంబంలోని మొత్తం మూడు తరాల హీరోలు కనిపించారు. ఇక నందమూరి కుటుంబానికి వస్తే ఎన్‌టీ రామారావు, బాలకృష్ణలు ఎన్నో సినిమాలలో తెరను పంచుకున్నారు. అలానే యువ తరం కళ్యాణ్ రామ్, బాలయ్యలు కూడా కలిసి చేశారు. మెగాస్టార్ ఫ్యామిలీలో చిరు, చెర్రీలు ఆచార్య సినిమాలో కలిసి కనిపించనున్నారు. మంచు ఫ్యామిలీ అయితే పాండవులు పాండవుతు తుమ్మెదా అంటూ అందరూ ఒకే స్క్రీన్‌పై కనిపించారు. ఈ నేపథ్యంలో దగ్గుపాటి ఫ్యామిలీలో వెంకటేష్, రానాలు కలిసి ఓ సినిమా చేయాలని అభమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ వారికి ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎటువంటి తీపి కబురు అందలేదు. అయితే రానా హీరోగా తెరకెక్కిన కృష్ణం వందే జగత్‌గురూ సినిమాలో వెంకీ ఒక్క పాటలో కనిపించాడు. అప్పటి నుంచి వీరి కాంబోలో సినిమా కావాలని అభిమానులు కోరుతున్న విషయం తెలిసిందే. వీరి కాంబో మాత్రం రాలేదు. అయితే ఇటీవల వెంకీ మాట్లాడుతూ సరైన కథ వస్తే తప్పకుండా చేస్తామని అన్నాడు. అయితే త్వరలో ఈ కాంబో చూసేందుకు చాన్స్ దక్కుతుందేమో అని అభిమానులు ఉవ్వీలూరుతున్నారు. మరి వారి కోరిక తీరుతుందో లేదో చూడాలి.