టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన వెస్టీండీస్ భారత్ ను బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. వ‌రుస విజయాల‌తో మంచి జోరు మీదున్న టీం ఇండియా హైద‌రాబాద్‌లోను విజ‌య దుందుభి మోగించి వ‌న్డే సిరీస్‌ని స‌రికొత్త ఉత్సాహంతో ప్రారంభించాల‌ని అనుకుంటుంది. ఇండియా టీంలో ష‌మీ స్థానంలో శార్ధూల్‌ని ఎంపిక చేయ‌గా, ఇది ఇత‌నికి తొలి టెస్ట్‌. ఇక వెస్టీండీస్ విష‌యానికి వ‌స్తే రెండు మార్పుల‌తో టీం బ‌రిలోకి దిగుతుంది. తొలి టెస్ట్ కి దూర‌మైన కెప్టెన్ హోల్డర్ మ‌ళ్లీ టీం లోకి వ‌చ్చాడు. 

రాజ్ కోట్ వేదికగా శనివారం ముగిసిన మ్యాచ్ లో భారత్ ఇన్సింగ్స్ 272 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా ప్రస్తుతం భారత్ 1-0తో ఆధిక్యంలో కొనసాగుతుంది. రెండో టెస్ట్ లోనూ విజయం సాధించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుంది.

జ‌ట్ల వివ‌రాలు
భార‌త్ : కోహ్లి (కెప్టెన్‌), పృధ్వీషా, కెఎల్ రాహుల్, పుజారా, రహానే, రిష‌బ్ పంత్‌, అశ్విన్, జడేజా, శార్దూల్ ఠాకూర్, ఉమేశ్, కుల్దీప్‌

వెస్టిండీస్‌: హోల్డర్‌ (కెప్టెన్‌), క్రెయిగ్‌ బ్రాత్‌వైట్, కీరన్‌ పావెల్, షై హోప్, ఆంబ్రిస్, హెట్‌మెయర్, ఛేజ్, డౌరిచ్, రోచ్, బిషూ , గాబ్రియెల్‌