టాలీవుడ్ పై కన్నేసిన వింక్ గర్ల్... 

టాలీవుడ్ పై కన్నేసిన వింక్ గర్ల్... 

ఓరు ఆధార్ లవ్ సినిమా అనగానే గుర్తుకు వచ్చేది వింక్ గర్ల్ ప్రియా వారియర్.  కన్ను కొట్టి గూగుల్ ను బుట్టలో వేసుకుంది.  ఏడాది పాటు ఆమెకు సంబంధించిన విషయాలను గూగుల్ సెర్చ్ చేసింది.  ఆమె ఎవరు ఎలా ఉంటుంది. ఫోటోలు తదితర విషయాలను సెర్చ్ చేశారు.  ఆ సమయంలో ఆమెకు అనేక ఆఫర్లు వచ్చాయి.  

కానీ, అధిక రెమ్యునరేషన్ కారణంగా వచ్చిన అవకాశాలు వెనక్కిపోయాయి.  కానీ, ఈ సినిమా రిలీజ్ అయ్యి భారీ పరాజయం పాలైంది.  సినిమా ఫెయిల్ కావడంతో వచ్చిన క్రేజ్ కాస్త ఒక్కసారిగా కుదేలైంది.  అయితే, ఈ సినిమా తరువాత ప్రియా వారియర్ టాలీవుడ్ పై కన్నేసింది.  నితిన్ కొత్త సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేస్తున్నది.  మరోవైపు నాగశౌర్య సినిమాలో కూడా మంచి అవకాశం దక్కించుకుంది. ఈ రెండు మంచిగా ఆడితే ఆమెకు తిరుగుండదని విశ్లేషకులు అంటున్నారు.