షేర్ల బై బ్యాక్‌కు విప్రో ఒకే

షేర్ల బై బ్యాక్‌కు విప్రో ఒకే

ఒక్కో షేర్‌ను రూ. 325 చొప్పున రూ. 10,500 కోట్ల విలువైన షేర్లను బై బ్యాక్‌ చేసేందుకు విప్రో కంపెనీ డైరెక్టర్ల బోర్దు నిర్ణయించింది. కంపెనీ పెయిడ్‌ అప్‌ క్యాపిటల్‌లో 5.35 శాతానికి సమానమైన 32,30,73,923 షేర్లను కంపెనీ కొనుగోలు చేస్తుంది. ఇవాళ మార్కెట్‌లో షేర్‌ రూ. 281.6 వద్ద ముగిసింది. అంటే ఈ ధరకు 15.4 శాతం ప్రీమియంతో షేర్లను కొనుగోలు చేస్తుందన్నమాట. 2017 నవంబర్‌లో కంపెనీ రూ.320 చొప్పున రూ. 11,000 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసింది. ఒకే ఏడాదిలో రెండు సార్లు బై బ్యాక్‌ చేసేందుకు నిబంధనలు అంగీకరించవు. 
కంపెనీ పనితీరు ఓకే
మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ పనితీరు దాదాపు మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగానే ఉంది. మార్చితో  ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 14,586 కోట్ల టర్నోవర్‌పై రూ. 2,483 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం ఒక శాతం, టర్నోవర్‌ అర శాతం మేర తగ్గాయి. డాలర్ల లెక్కలో ఐటీ సర్వీసుల నుంచి ఆదాయం 1.4 శాతం పెరిగింది.