సింధుకు అభినందనల వెల్లువ

సింధుకు అభినందనల వెల్లువ

బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ లో జపాన్‌కు చెందిన నొజోమీ ఒకుహరాను ఓడించి భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రముఖ రాజకీయ  నాయకులు సింధుకు అభినందనలు తెలిపారు. టైటిల్ నెగ్గిన సింధుకు తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. ఇలాంటి విజయాలు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్షించారు. టైటిల్ విజేత సింధుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గవర్నర్ నరసింహన్ కూడా అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో సింధు మరిన్ని విజయాలను సాధించాలని కోరుకున్నారు.