అంబటి రాయుడు సంచలన నిర్ణయం

అంబటి రాయుడు సంచలన నిర్ణయం

టీమిండియా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్ మెన్, హైదరాబాద్‌ క్రికెటర్‌ అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫస్ట్‌క్లాస్‌ కెరీర్‌కు గుడ్‌ బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు రాసిన లేఖలో...'ఇక నుంచి కేవలం వైట్‌బాల్‌ గేమ్‌పై మాత్రమే దృష్టి పెట్టదల్చుకున్నాను. నేను హైదరాబాద్‌కు ఆడిన ప్రతీక్షణాన్ని ఆస్వాదించాను. దాన్ని చాలా గౌరవంగా భావించాను. నాకు హెచ్‌సీఏ నుంచి వచ్చిన సహకారాన్ని ఎప్పటికీ మరవలేను. నా సహచర ఆటగాళ్లు మద్దతు కూడా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నేను ఇక ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ ఆడదలుచుకోలేదు. కేవలం అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాళీ టోర్నీల్లో పరిమిత ఓవర్ల  క్రికెట్‌ మాత్రమే ఆడతాను’ అని అంబటి రాయుడు తెలిపాడు.