పూరీ నెక్స్ట్ మూవీ ఎవరితో..?

పూరీ నెక్స్ట్ మూవీ ఎవరితో..?

టాలీవుడ్ లో మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ దర్శకుడు పూరి జగన్నాథ్. అతడు తన ప్రతి సినిమాలోను ఎంతో కొత్తగా చేస్తాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన గత సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే. ప్రస్తుతం పూరి రౌడీ హీరో విజయ్ తో లైగర్ అనే సినిమాను పాన్ ఇండియా రేంజిలో రూపొందిస్తున్నాడు. అయితే ఈ సినిమా పూర్తియైన తరువాత పూరి ప్లాన్స్ ఏంటని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పూర్తియైన తరువాత పూరి, అగ్రహీరో బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞను లాంచ్ చేయనున్నాడని వార్తలు వచ్చాయి. ఇంతలో మరో వార్త కూడా సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. పూరీ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన సినిమా విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను కలిసాడని, సినిమా లైన్ నచ్చడంతో పవన్ పూర్తి స్క్రిప్ట్ కోరాడని వార్తలు నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన సినిమా ఎంతో కాలంగా వాయిదా పడుతూ వచ్చింది. ఈ సినిమాను మొదట మహేష్‌తో చేయాలనుకున్నా, మహేష్ ఆసక్తి చూపలేదు. దాంతో పవన్‌కు కథ చెప్పేందుకు కలిసాడంట. అయితే మోక్షజ్ఞను కూడా ఓ భారీ మాస్ మసాలా కథతో తెలుగు వెండితెరకు హీరోగా పరిచయం చేయనున్నాడని అన్నారు. మరి దీనిపై పూరినే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అప్పటి వరకు ఈ ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. అతి త్వరలోనే ఈ ప్రశ్నలకు అన్నిటికీ ఫుల్ స్టాప్ పడుతుందని అనుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.