నేపాల్ లో కొత్త పరుగులు: భర్తలను వీపుపై ఎక్కించుకొని... 

నేపాల్ లో కొత్త పరుగులు: భర్తలను వీపుపై ఎక్కించుకొని... 

మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.  ఇంకా చెప్పాలి అంటే మగవాళ్లకంటే ఆడవాళ్లు ఎక్కువగా రాణిస్తున్నారు. పురుషులతో సమానంగా పనిచేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు.  బరువులను కూడా మోస్తున్నారు.  నేపాల్ లో ఇటీవలే మహిళల కోసం ఓ పోటీని ఏర్పాటు చేశారు.  అది పరుగుల పోటీ.  అయితే, ఈ పరుగుల పోటీని కొంచెం వెరైటీగా నిర్వహించారు నిర్వాహకులు.  పెళ్ళైన మహిళలు తమ భర్తలను వీపుపై ఎక్కించుకొని పరుగులు తీయాలి.  ఎవరైతే ముందుగా టార్గెట్ ను చేరుకుంటారో వారే విజేత.  ఈ వందమీటర్ల పరుగుపందెంలో 16 జంటలు పోటీ పడ్డాయి. తమ భర్తలను వీపుపై ఎక్కించుకొని పరుగులు తీశారు.  ఈ పరుగుపందెం కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఈ పోటీని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వేదిక వద్దకు చేరుకోవడం విశేషం.  విజేతలతో పాటుగా పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రాలను అందజేశారు.  మహిళలు ఎందులోనూ తక్కువ కాదు.  అందరూ సమానవే అని చెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు నిర్వాహకులు.