రివ్యూ: వరల్డ్ ఫేమస్ లవర్ 

రివ్యూ: వరల్డ్ ఫేమస్ లవర్ 

నటీనటులు: విజయ్ దేవరకొండ, రాశిఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ థ్రెసా, ఇజబెల్లా తదితరులు 

మ్యూజిక్ : గోపి సుందర్ 

సినిమాటోగ్రఫీ: జయకృష్ణ గుమ్మడి 

నిర్మాత : కె వల్లభ 

దర్శకత్వం: క్రాంతి మాధవ్ 

అర్జున్ రెడ్డి సినిమాతో రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యిన విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమాతో వంద కోట్ల హీరోగా మారిపోయారు.  ఈ సినిమా విజయం సాధించిన తరువాత అక్కడక్కడా బ్రేకులు పడినా, ఆ తరువాత క్రేజ్ మాత్రం తగ్గలేదు.  ఇప్పుడు మూడు విభిన్న ప్రేమకథలతో కూడిన వరల్డ్ ఫేమస్ లవర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రాశిఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ థ్రెసా, ఇజబెల్లాలతో కలిసి రొమాన్స్ చేసిన  ఈ లవర్ ఎలా ఉన్నాడో, ప్రేక్షకులకు ఎంత దగ్గరయ్యాడో చూద్దాం.  

కథ: 

విజయ్ దేవరకొండ... రాశిఖన్నాలు ప్రేమించుకుంటారు.  పెళ్లి చేసుకుంటే కొన్ని ఇబ్బందులు వస్తాయని, సంసారంలో కలిగే ఇబ్బందుల మూలంగా విడిపోవాల్సి వస్తుందనే భయంతో పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేయాలని నిర్ణయం తీసుకుంటారు. అయితే, విజయ్ దేవరకొండ మొదటి నుంచి ఓ రచయిత.  తాను రచయితగా ఎదగాలని నిర్ణయం తీసుకుంటాడు.  ఉద్యోగం కూడా చేయడు.  సహజీవనం చేస్తున్న రాశిఖన్నాను కూడా పట్టించుకోడు.  దీంతో ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి.  విడిపోవాలని అనుకుంటారు.  ఎంత చెప్పినా రాశిఖన్నా వినిపించుకోదు.  ఆ తరువాత విజయ్ మరో కథ రాయడం మొదలుపెడతాడు... ఆ కథ ఏంటి? ఎవరిదీ ఆ కథ.  ఎందుకు రాయాల్సి వచ్చింది... చివరికి ఏమైంది అన్నది మిగతా కథ.  

విశ్లేషణ: 

ఒక ప్రేమ కథకు మరో రెండు ప్రేమకథలు అల్లి తీసిన సినిమా ఇది.  రాశిఖన్నాతో మొదలైన ప్రేమ, సహజీవనం మొదలౌతుంది.  అమ్మాయికి ఎన్నో ఆశలు, ఆశయాలు ఉంటాయి.  విజయ్ మొదలు పెట్టిన జీవనం హాయిగా సాగాలని అనుకుంటుంది.  ఏ అమ్మాయి అయినా అలానే కోరుకుంటుంది.  అలా కోరుకునే అమ్మాయికి అవి దూరం అయితే పడే బాధను సినిమాలో చూపించారు.  రాశిఖన్నా ఈ పాత్రలో ఒదిగిపోయి నటించింది.  వీరిద్దరూ విడిపోయిన తరువాత మొదలైన కథ సహజత్వానికి దగ్గరగా ఉంటుంది.  విజయ్... ఐశ్వర్య భార్యాభర్తలుగా కలిసి ఉంటారు.  వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు సరదాగా ఉంటాయి.  అదే సమయంలో విజయ్ కేథరిన్ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయి.  ఈ కథ తరువాత ఫ్రాన్స్ లో మరో కథ మొదలౌతుంది. అందులో ఇజబెల్లా తో కలిసి విజయ్ ప్రయాణం చేస్తుంటాడు.  ఇద్దరి మధ్య లవ్ స్టోరీ నడుస్తుంది.  ఇజబెల్లాకు కళ్ళు పోవడంతో హీరో తన కళ్ళను దానం చేస్తాడు.  ఇది లాజిక్ దూరంగా ఉన్నా సినిమా కాబట్టి సరిపెట్టుకోవాలి.  క్లైమాక్స్ సీన్స్ కూడా మాములుగా ఉంటాయి.  

ఎవరెలా చేశారంటే... 

విజయ్ దేవరకొండ మూడు పాత్రల్లో ఒదిగిపోయి నటించాడు. మూడు పాత్రల్లో కూడా శీనయ్య పాత్రల్లో సహజత్వానికి దగ్గరగా నటించి మెప్పించాడు.  ఇక గౌతమి పాత్రలో రాశిఖన్నా ఆకట్టుకుంది.  భావోద్వేగాలు పలికించడంలో సక్సెస్ అయ్యింది.  అలానే ఐశ్వర్య రాజేష్ సువర్ణ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది.  ఇజబెల్లా, కేథరిన్ పాత్రల నిడివి తక్కువే అయినా మెప్పించారు.  

సాంకేతిక వర్గం పనితీరు: 

క్రాంతిమాధవ్ రచయితగా మరోసారి మెప్పించాడు.  ఒక ప్రేమకథకు మరో రెండు ప్రేమ కథలు జోడించి చెప్పడం అన్నది గొప్ప విషయం.  అందులో సందేహం అవసరం లేదు.  అయితే, రచయితగా మెప్పించినా, దర్శకుడిగా మాత్రం ఫెయిల్ మెప్పించలేకపోయాడు.  ప్రేమ కథలకు సంగీతం ప్రధాన బలంగా ఉండాలి.  ఈ సినిమాకు మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేదు.  సినిమాటోగ్రఫీ సినిమాకు బాగుంది.  

పాజిటివ్ పాయింట్స్: 

నటీనటులు 

ఇల్లేందు నేపధ్యం 

ఫస్ట్ హాఫ్ 

సినిమాటోగ్రఫీ 

మైనస్ పాయింట్స్ : 

సెకండ్ హాఫ్ 

మ్యూజిక్ 

చివరిగా: వరల్డ్ ఫేమస్ లవర్ - ఆ స్థాయిలో మెప్పించలేకపోయాడు..