మహిళ తలలో బుల్లెట్ దించిన బీజేపీ నేత..!

మహిళ తలలో బుల్లెట్ దించిన బీజేపీ నేత..!

ఢిల్లీలో నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ పార్టీలో బీహార్‌కు చెందిన బీజేపీ నేత ఓ మహిళ హెడ్‌కు గురిపెట్టి కాల్పులు జరపడంతో ఆమె మృతిచెందింది.. బీజేపీ నేత రాజు కుమార్ సింగ్.. గతంలో జేడీ(యూ) నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే న్యూ ఇయర్ వేడుకల్లో అర్చన గుప్తా (45)పై కాల్పులు జరిపాడు మాజీ ఎమ్మెల్యే... ఈ కాల్పుల్లో ఆమె తీవ్రంగా గాయపడింది... అనంతరం ఆస్పత్రికి తరలించగా... వసంత్ కుంజ్ ప్రాంతంలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్చన గుప్తా మృతిచెందారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు అర్చన గుప్తా భర్త వికాస్ గుప్తా... బీజేపీ నేత రెండు, మూడు రౌండ్లు కాల్పులు జరిపారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో ఆమె అక్కడే కుప్పకూలిపోయిందని... తీవ్ర రక్తస్రావం ఉండడంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించాడమని... చికిత్స పొందుతూ ఆమె గురువారం ఉదయం మృతిచెందినట్టు తెలిపారు. దీంతో బీజేపీ నేతపై కేసు నమోదు చేసిన పోలీసులు... కాల్పుల్లోనే అర్చన గుప్తా మృతిచెందినట్టు సౌత్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. ఇక యూపీలోని గోరఖ్‌పూర్‌లో సింగ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు... సోమవారం కాల్పులు జరిపిన తర్వాత పారిపోయిన సింగ్‌ను గోరఖ్‌పూర్‌లో పట్టుకున్నారు పోలీసులు. మరోవైపు ఢిల్లీలో ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు రెండు రైఫిల్స్, తుపాకీ, 800 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.