వేరే కులం వ్యక్తిని పెళ్లాడిందని వింత శిక్ష !

వేరే కులం వ్యక్తిని పెళ్లాడిందని వింత శిక్ష !

మధ్యప్రదేశ్, భోపాల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.  వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమించి, పెళ్లాడిందనే నెపంతో యువతిని కిరాతకంగా శిక్షించారు ఆ గ్రామ పెద్దలు.   దేవిగఢ్‌ గ్రామానికి చెందిన ఓ యువతి వేరే కులం వ్యక్తిని పెళ్లాడింది.  విషయం తెలిసి కోపగించుకున్న పెద్దలు యువతికి శిక్షగా భర్తను భుజంపై మోసుకుని 35 కోలోమీటర్లు నడవాలని ఆదేశించారు.  వెంటనే శిక్షను అమలుచేశారు.  మధ్యలో నడవలేక ఆగిపోయిన యువతిని కర్రలతో కొడుతూ పైశాచిక ఆనందాన్ని పొందారు.  విషయం తెలుసుకున్న పోలీసులు ఇప్పటికే ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.